హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటీషన్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తన పై విచారణలో ఉన్న కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడంలో చేసిన ప్రసంగం పై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డి పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు పై విచారణ చేపట్టిన కోర్టు సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం ఆడియో, వీడియో క్లిప్ ను పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.

ఈ కేసును కొట్టివేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హై కోర్టులో పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు విచారణ చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని.. విచారణ హాజరు నుంచి మినహాయింపు కూడా ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. రేపు విచారణలో కోర్టు ఏం చెబుతుందనే దాని కోసం వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news