స్ఫూర్తి: ఈ IAS సక్సెస్ స్టోరీ ని చూస్తే శభాష్ అంటారు..!

-

జీవితంలో మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం కానీ అనుకున్నవన్నీ కూడా అవ్వవు. మనం అనుకున్నది సాధించాలంటే దానికి తగ్గ కృషి తప్పకుండా ఉండాలి. అలానే పట్టుదలతో శ్రమిస్తే కచ్చితంగా గెలవచ్చు. తొలి ప్రయత్నం లోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ లో విజయాన్ని అందుకున్నాడు సత్యం గాంధీ. సత్యం గాంధీ దేశ వ్యాప్తంగా పదవ ర్యాంకు సాధించాడు. సత్యం గాంధీ సక్సెస్ స్టోరీ ని చూస్తే మీరు కూడా శభాష్ అంటారు. మరి చూసేయండి.

బీహార్ లోని సమస్తిపూర్‌లో దిఘరా గ్రామానికి చెందిన వాడు సత్యం. సత్యం తండ్రి అఖిలేష్ కుమార్ తల్లి మంజు కుమారి. తండ్రి ఒక సాధారణ రైతు. సత్యం ఒకటో తరగతి నుండి 12వ తరగతి దాకా కేంద్రీయ విద్యాలయం లో చదువుకున్నాడు. 2017 లో గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఢిల్లీ వెళ్ళాడు.

పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే వీళ్ళది మధ్య తరగతి కుటుంబం కావడం వలన చదివించేందుకు తండ్రి దగ్గర డబ్బులు లేక పోవడంతో ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు. బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకుని సత్యాన్ని చదివించాడు. తన తండ్రి పడిన కష్టాన్ని అర్థం చేసుకునే తను కూడా బాగా చదువుకున్నాడు ఇలా ఆఖరికి యూపీఎస్సీ సివిల్స్ లో పదవ ర్యాంక్ సాధించాడు.

తల్లిదండ్రులు చేసిన త్యాగాలని సత్యం గుర్తించి ఎంతో కష్టపడి ఈ స్థాయి కి వచ్చాడు చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాన్ని అర్థం చేసుకోరు కానీ నిజానికి అలా అర్థం చేసుకొని మంచి బాట పడితే ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ ని అందుకోగలడు.

Read more RELATED
Recommended to you

Latest news