స్ఫూర్తి: 700కిలోల చెత్త‌ను తొల‌గించిన యువ‌తి…!

-

ఈ మధ్య కాలం లో ఎవరు ఇళ్ళని వాళ్ళు శుభ్రం చేసుకోవడానికే సమయం, ఓపిక ఉండట్లేదు. అలాంటిది మన పర్యావరణాన్ని, ప్రకృతిని పట్టించుకోవడం ఎవరికీ జరిగే పని కాదు. అయితే ప్రకృతి కోసం ప్రజల కోసం జీవరాసులు కోసం బతికే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే నిజంగా ఆ తక్కువ మందిలో ఈమె కూడా ఒకరు. నిజానికి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే కచ్చితంగా మన ప్రకృతిని మనం కాపాడుకోవచ్చు.

పర్యావరణ సమస్యలని కూడా మనమే తొలగించుకోవచ్చు. అయితే మరి ఈమె చేసిన మంచి పని ఏమిటి..? ఆ యువతి ఎవరు అనే విషయం ఇపుడు చూద్దాం. నదుల కలుషితమవుతున్న సంగతి అందరికీ తెలుసు. స్నేహ సాహిని అనే ఒక యువత కలుషితమైన నదిని బాగుచేయడానికి కష్టపడ్డారు. ప్లాస్టిక్ కవర్లు, ధర్మకోల్ లాంటివి జలరాసులు కి ఇబ్బంది కలుగుతాయని అందుకే అక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు ఆమె ఒక్కరే నదిలో చెత్తను శుభ్రం చేయడం మొదలుపెట్టారు.

ఒక్కొక్కసారి తన స్నేహితులు కూడా ఆమెకు సహాయం చేసేవారు. ఇలా ఆమె ఏడు వందల కిలోల చెత్తను నది నుండి తీసి వేశారు. ఈమె చేసిన పని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఈమెకి అవార్డులు కూడా ఇచ్చాయి. నిజంగా ఈమె చేసిన సోషల్ సర్వీస్ చాలా గొప్పది. ఈమె నడిచిన బాటలో అందరూ నడిస్తే మన పర్యావరణం బాగుంటుంది అలానే మనం మనం ఉండే నేలని కలుషితం కాకుండా చూసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news