బెంగళూరులో జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఆ యువ బౌలర్ దుమ్మురేపాడు. ఏకంగా రూ.10కోట్ల ధర పలికాడు. అతడే భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.10కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ప్రసిద్ధి చెందిన కృష్ణ బేస్ ధర కేవలం రూ.1కోటి మాత్రమే ఉన్నది. అయితే అతని ఫామ్, సామర్థ్యాన్ని చూసి ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతన్నీ కొనుగోలు చేయడానికి తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ అతన్ని దక్కించుకుంది.
ప్రసిద్ధ్ కృష్ణ కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్ బిడ్ వేసింది. ఆ తరువాత రాజస్థాన్ రాయల్స్ రంగంలోకి దిగింది. కృష్ణ ధర రూ.5.50 కోట్లకు చేరడంతో గుజరాత్ టైటాన్స్ కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు బిడ్ వేసింది. మూడు జట్ల మధ్య జరిగిన ఈ పోరు రూ.10కోట్లకు చేరుకోగా..రాజస్థాన్ విజయం సాధించింది.
2018లో ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేశాడు. తొలుత అతన్ని కోల్‌కతా కొనుగోలు చేసింది. గత ఏడాది వరకు అతను కేకేఆర్ జట్టులోనే ఉన్నాడు. కేవల రూ.20లక్షలకు కొనుగోలు చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. వన్డే సిరీస్‌లో 9 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. రెండేండ్ల కాలంలో 26 మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టాడు ప్రసిద్ధ్ కృష్ణ.