సింగపూర్ ఎయిర్‌ షోలో తేజస్ యుద్ధ విమానాల ప్రదర్శన

-

సింగ‌పూర్ ఎయిర్ షోలో భార‌త్ అభివృద్ధి చేసిన తేజ‌స్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాప్ట్‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌నున్నారు. వ‌చ్చే వారం నాలుగు రోజుల పాటు సింగపూర్ ఎయిర్ షో -2022 జ‌రుగ‌నున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 18 వ‌ర‌కు జ‌రిగే ఈ ఎయిర్ షోలో పాల్గొనేందుకు భార‌త వైమానిక ద‌ళానికి చెందిన 44 మంది స‌భ్యుల బృందం శ‌నివారం సింగపూర్‌కు వెళ్లింద‌ని ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

ముఖ్యంగా తేజ‌స్ యుద్ధ విమానం త‌క్కువ‌స్థాయి ఏరోబాటిక్స్ ప్ర‌ద‌ర్శ‌న‌తో తేలిక‌గా ఒదిగిపోయి అత్యుత్త‌మ ప‌ని త‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తోందని ర‌క్ష‌ణ శాఖ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సింగ‌పూర్ ఎయిర్ షో ప్ర‌పంచ విమాన‌యాన ప‌రిశ్ర‌మ త‌న ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి ఇది మంచి వేదిక‌. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో దుబాయ్‌లో జ‌రిగిన ఎయిర్ షోలో భార‌త వైమానిక ద‌ళానికి చెందిన తేజ‌స్ యుద్ధ విమానాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. తేజ‌స్‌, ఎయిర్ క్రాప్ట్ వివిధ దేశాల రక్ష‌ణ శాఖ‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు. సింగ‌పూర్‌లోనూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌నున్న‌ద‌ని ర‌క్ష‌ణ వ‌ర్గాలు ఆశాభావం వ్య‌క్తం చేస్తూ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news