ఎల్బీ స్టేడియంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి.. క్రికెట్ ఆడి!

-

పబ్లిక్ గార్డెన్ సమీపంలోని ఎల్బీస్టేడియంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి చేశారు. క్రికెట్ ఆడి అలరించారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ టీ 20 ఛాంపియన్షిప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో “క్రికెట్ ఖేలో నషా చోడో” నినాదంతో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆడి ఆటగాళ్లలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సాహాన్ని నింపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బ్యాటింగ్ చేయగా.. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి బౌలింగ్ చేశారు. అనంతరం టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లేయర్లకు జెర్సీ, టోపీలను అందజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news