స్వదేశీని ఆద‌రిద్దాం.. ”ఇన్‌స్టాల్ ఇండియా” #InstallINDIA..

-

భారత దేశం నా మాతృ భూమి భారతీయులందరూ నా సహోదరులు.. నేనే నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.. ఇది మనం చేసే ప్రతిజ్ఞ.. అది చిన్నప్పుడు స్కూల్లోనే లెండి.. ఒక్కసారి స్కూల్‌ అయిపోయాక అది ఒక గుర్తు మాత్రమే.. సినిమా హాల్లలో జాతీయగీతం వస్తేనే చిరాకు పడేవరెందరో.. మరి దేశం పై ఎలా ప్రేమను చూపిస్తాం..? ఎలా చూపించాలి..? అది సమయమే మనకు తెలియజేస్తుంది. అలాంటి సమయమే ఇప్పుడు వచ్చింది.

విషయానికి వస్తే చిన్న చిన్నగా మొదలైన చైనా వ్యాపారం ఇప్పడు మహా వృక్షంలా తయ్యారయ్యింది. ఎందుకంటే తక్కువ రేటులో వస్తువులను అందిస్తున్నారు కాబట్టి.. అలా మనమీద చైనా వ్యాపం చేస్తూ లక్షల కోట్లల్లో ఆదాయం సంపాదిస్తుంది. అంతవరకు బాగానే ఉంది మనకూ ఏమీ ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనపైకే యుద్దానికి కాలుదువ్వారో..? ఇంకా వారిని ఉపేక్షించాలా..? వారికి మనం సాయం చెయ్యాలా..?

చైనాకు చెక్ పెట్టేందుకు తొలి అడుగుగా వారి యాప్స్‌ను బ్యాన్‌ చేశాం దానికి కారణం మన సమాచారాన్ని సేకరిస్తున్నారని. అవి మాత్రమే కాదు చైనా వస్తువులు మొత్తం బ్యాన్‌ చెయ్యాలి అనేది మరో వాదన తెరపైకి వచ్చింది. ఇప్పుడు చైనా మనపై దండెత్తుతోంది కాబట్టి చైనాను పక్కన పెడుతున్నాం.. మనైనందిన జీవితంలో ఉదయం లేచిన దగ్గరనుండి పడుకునే వరకు విదేశీ వస్తువులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. దీనివల్ల లాభపడేది విదేశీ కంపెనీలు.. ఆ దేశాలు మాత్రమే.. మరి రేపు ఇంకో దేశం చైనాలా చేస్తే..? మనతో డబ్బులు సంపాదించి మనమీదే విషం చిమ్మితే..? అప్పటి వరకు మనం ఆగాల్సిందేనా..?

దేశంలో ట్యాలెంట్‌కి కొదువ లేదు.. కానీ ప్రోత్సాహమే కరువవుతుంది. అది ప్రభుత్వాల నుండి కావచ్చు.. ప్రజల నుండి కావచ్చు.. మనం ఎదగటానికి కావాల్సిన‌న్ని పుష్క‌ల‌మైన స‌దుపాయాలు ఉన్నాయి. వ‌స్తువుల‌ను ఉత్ప‌త్తి చేసేందుకు కావ‌ల్సిన ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు అన్ని ర‌కాల మౌలిక వ‌స‌తులూ ఉన్నాయి. కానీ మ‌నం వ‌స్తువుల‌ను మ‌న‌మే ఎందుకు త‌యారు చేసుకోలేక‌పోతున్నాం ? ఆలోచించండి. ఎంత‌కాలం మ‌నం ప‌క్క‌వాడి వ‌స్తువులపై ఆధార ప‌డ‌దాం ? మ‌న‌కు తెలివి లేదా? జ్ఞానం లేదా? స‌దుపాయాలు లేవా ? అన్నీ ఉన్నాయి. అయినా ఎందుకు వెనుకపడిపోతున్నాం? విదేశీపై మోజా?? కావొచ్చు.. కాకపోవచ్చు…

ఇక చౌక ధరలకు వస్తువులను అందించడంలో విఫలం కావడం కూడా ముఖ్యమైన కారణం. చైనా వాడు ఇవ్వగలడు కాని మనం ఎందుకు తక్కువ ధరకు ఇవ్వలేకపోతున్నాం..?? దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సామాన్యులకు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా మంచి ధరకు ఇవ్వగలిగితే సమస్య కొంతమేరకు తగ్గుతుంది.

ఎవ‌డో దేశం వాడు త‌యారు చేసిన వ‌స్తువుల‌ను వాడ‌డం.. అవి మ‌న‌కు హాని క‌లిగిస్తాయ‌ని చెప్పి వాటిని బ్యాన్ చేయ‌డం.. ఇదంతా చూస్తే చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా లేదూ.. అదేదో మ‌న‌మే ఆ వ‌స్తువుల‌ను త‌యారు చేసుకుంటే మ‌న‌పై మ‌న‌కు న‌మ్మ‌కం ఉంటుంది క‌దా.. రేప్పొద్దున త‌గ‌వు వ‌చ్చినా మ‌న‌వాళ్ల‌తోనే కాబ‌ట్టి.. మ‌నం సెటిల్ చేసుకోవ‌చ్చు. విదేశీ వాడు అయితే మాయ చేస్తాడు. మంత్రం వేస్తాడు. క‌నుక స్వదేశీని ఆద‌రిద్దాం.

స్వదేశీ వ‌స్తువుల‌ను వాడితే రేప్పొద్దున మ‌న వాళ్లే మ‌రిన్ని కంపెనీలు మ‌న దేశంలో నెల‌కొల్పుతారు. దీంతో మ‌న‌కే ఉద్యోగాలు వ‌స్తాయి. మ‌న దేశమే వృద్ది చెందుతుంది. అదే ప‌రాయి దేశ‌స్తుడి వ‌స్తువులు అయితే వాడి దేశానికి ఆ డ‌బ్బు వెళ్తుంది. అన‌వ‌స‌రంగా వాడికి మ‌నం డ‌బ్బు ఇచ్చి వాన్ని పైకి లేపిన‌ట్లు అవుతుంది. క‌నుక ఇప్ప‌టికైనా మేల్కొందా.. విదేశీ యాప్‌లే కాదు, వ‌స్తువుల‌నూ వాడ‌డం మానుకుందాం. స్వదేశీకి స‌హ‌కరిద్దాం. దేశ అభివృద్ధిలో పాలు పంచుకుందాం. అందుకే #InstallINDIA అంటూ “మనలోకం” పిలుపునిస్తోంది.. రండి.. ఈ ఉద్య‌మంలో పాల్గొనండి.. వీలైనంతగా ప్రయత్నం చేయండి..!


మోబైల్స్‌లో ఇండియా యాప్స్‌ ఇన్‌స్టాల్ చేయడమే కాదు.. గుండె నిండా దేశ స్పూర్తిని ఇన్‌స్టాల్ చేసుకుందాం.. అదే InstallINDIA మనలోకం పిలుపు స్పందనగా వీలైనంతగా ఈ పిలుపు గ్రామ గ్రామానికి చేరేలా మనవంతుగా కృషి చేద్దాం..

జై భారత్‌..! జై జై భార‌త్‌..!!

-RK

Read more RELATED
Recommended to you

Latest news