‘మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈ రోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్లం కాదు. స్వాతంత్ర్య అమర వీరుల్లో విప్లవాగ్ని రగిలేది కాదు. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నాడు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారు’ అని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు తన ట్వీట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు నేడు అల్లూరి పుట్టిన రోజు సందర్భంగా ఆయన అల్లూరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అల్లూరి సీతారామరాజు ఆంధ్రుల ఆరాధ్యుడు అని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు ఆంగ్లులని ఎదురించి పోరాడినందుకే ఇవాలా మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాము అని ఆయన పేర్కొన్నారు.
మన్నెం ప్రజల సమస్యలు తనకెందుకులే అనుకుంటే ఈరోజు అల్లూరి సీతారామరాజు గురించి మనం చెప్పుకునేవాళ్ళం కాదు. స్వాతంత్య్ర సమర వీరులలో విప్లవాగ్ని రగిలేది కాదు. అన్యాయం ఎక్కడ జరిగినా అడ్డుకున్నాడు కాబట్టే అల్లూరి మనకు ఆరాధ్యుడయ్యారు(1/3)#200DaysOfAmaravatiProtests pic.twitter.com/QgmYpvNgFR
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 4, 2020
ప్రజలు కూడా ఈ ప్రభుత్వాలను ఎదురాడి పోరాడాలి అప్పుడే మనం చరిత్ర సృష్టించగలం అని ఆయన అన్నారు. ‘అమరావతి ఉద్యమంలోనూ అల్లూరి స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలందరూ అందుకోవాలి. అమరావతిలో కానీ మరెక్కడైనా కానీ, ప్రజలకు ద్రోహం చేయాలన్నా, వారి భవిష్యత్తును కాలరాయాలన్నా పాలకులు భయపడాలంటే 5 కోట్ల అల్లూరి సీతారామరాజులు ఒక్కటిగా గర్జించాలి. అప్పుడే అమరావతి రూపంలో మన ఆత్మగౌరవం నిలబడుతుంది’ అని అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్లు తమతమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ తెలుగు వీర కిశోరం స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను(3/3)#200DaysOfAmaravatiProtests
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 4, 2020