బీమా స్కాంలో వెలుగులోకి సంచలన అంశాలు.. ఆ సినిమా స్ఫూర్తితోనే ?

-

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన బీమా స్కాంలో కొన్ని సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం రిలీజయిన భద్రమ్ అనే రీమేక్ సినిమా చూసి ఈ గ్యాంగ్ నేరాలకు స్కెచ్ గీసినట్టుగా గుర్తించారు. సినిమాలో అనాధలకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించి ముఠా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే చనిపోయినా పర్వాలేదు అనుకున్న వారిని టార్గెట్ చేస్తారు. వారి పేరు మీద వీరే పాలసీలు కడతారు కూడా.

ముఖ్యంగా భర్తలు అనారోగ్యంతో బాధ పడుతున్న మహిళలు, భర్త ఉండగానే ప్రియుళ్లతో సరస సల్లాపాలు సాగిస్తున్న మహిళలే ఈ ముఠా టార్గెట్. వారితో మాట కలిపి ప్లాన్ వివరిస్తారు. అలా వివరించి మీకు కొంత పర్సంటేజ్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంటారు. కుదుర్చుకుని పాలసీ కట్టడం మొదలు పెట్టిన ఏడాది లోపు వారిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి క్లెయిం చేస్తారు. వాటా ప్రకారం భార్యలకు డబ్బు ఇచ్చేస్తారు. ఇక ఇలా మొత్తం ఐదుగురిని చంపినట్టు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news