పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద జరిగిన దాడి అనంతరం ఏర్పడిన గాయాల మీద రాజకీయ దుమారం రేగుతోంది. నిన్న నందిగ్రామ్ దగ్గర సీఎం మమతా బెనర్జీ కి గాయాలయ్యాయి. తన మీద నలుగురైదుగురు కలిసి దాడి చేశారని సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కలకత్తాలోని ఎస్కెఎస్ కె ఎం హాస్పిటల్లో మమత చికిత్స పొందుతున్నారు. గాయాల తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డానని మమత చెబుతున్నారు.
అయితే మమతకు తగిలిన గాయాల మీద బెంగాల్ విపక్ష నేతలు పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు మమత చేతుల్లోనే ఉంటే దాడి ఎలా జరిగిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. సానుభూతి పొందేందుకే మమతా బెనర్జీ డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ విమర్శించింది. అయితే ఇది ప్రమాదం మాత్రమేనని, కావాలని జరిగిన దాడిగా తాము భావించడం లేదని బీజేపీ చెబుతోంది. ఇక మమతకు గాయాలు కావడంతో తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల పై సందిగ్ధం నెలకొంది.