Telangana: ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటినుండి మొదలు కాబోతున్నాయి. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉండడంతో పరీక్షల నిర్వహణకి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసారు. ఉదయం తొమ్మిది గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం నుండి మార్చి 19వ తేదీ వరకు ఇవి కొనసాగిపోతున్నాయి.
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అవకాశాలు అవకతవకలు చోటు లేకుండా సీసీ కెమెరాలు ని ఏర్పాటు చేయడం జరిగింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన తాగునీటిని అందుబాటులో ఉంచారు ప్రథమ చికిత్స కేంద్రాలని కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను పరీక్ష కేంద్రాల వరకు నడపాలని అధికారులని సూచించారు పరీక్షలు జరిగే హాల్లో మొత్తం 25 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునేలా ఏర్పాటు చేశారు.