సురక్షితమైన పెట్టుబడి పెట్టాలనుకునే ప్రజలకు పోస్టాఫీసు పొదుపు పథకాలు చాలా మంచి ఎంపిక.. ఇక్కడ ఎన్నో పథకాలు ఉన్నాయి.. వీటిల్లో మీ డబ్బును పొదుపు చేయడం వల్ల మీ అవసరాలకు వాటిని వాడుకోవచ్చు.. జీవితంలో పెద్ద పెద్ద ఖర్చులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పొదుపు పథకాలు మీకు ఉపయోగపడతాయి. చాలా పథకాలు సురక్షితమైనవి, అత్యంత లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు అలాంటి స్కీమ్స్‌లో ఉన్న ఒక మంచి స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఇందులో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే రూ.18 లక్షలు వస్తాయి.
నేషనల్ సేవింగ్స్ సిరీస్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్ అనేది పోస్టల్ రంగం యొక్క ప్రసిద్ధ పొదుపు పథకాలలో ఒకటి. ఈ స్కీమ్‌లో పెట్టే పెట్టుబడికి సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం చక్రవడ్డీ మోడ్‌లో మెరుగైన మెచ్యూరిటీ మొత్తాన్ని నిర్ధారిస్తుంది. వ్యక్తులు లేదా గరిష్టంగా 3 మంది వ్యక్తులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం రూ.100 నుంచి మీకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు.
పోస్ట్ ఆఫీస్ RD పథకం
నేషనల్ సేవింగ్స్ సిరీస్ డిపాజిట్ ఖాతా పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు. పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఈ పథకంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ద్వారా ఖాతా తెరవవచ్చు.
పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేటు
ఈ పథకంలో అడ్వాన్స్ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది. అంటే మీరు ఒకేసారి 5 సంవత్సరాల పాటు పెట్టుబడిని చెల్లించడానికి అడ్వాన్స్ డిపాజిట్ ఎంపికను ఉపయోగించవచ్చు. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి ఏడాది తర్వాత రుణం పొందే అవకాశం కూడా ఉంది.
పోస్ట్ ఆఫీస్ NSRDA పథకం వడ్డీ
ఈ పథకంలో నెలకు రూ.25,000 చెల్లిస్తే ఏడాదికి రూ.3 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. 5 ఏళ్లలో రూ.15 లక్షలు అవుతుంది. దీనికి వడ్డీగా రూ.2,84,146 లభిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.17,84,146 అవుతుంది. ఈ పథకంలో అందరూ చేరలేరు.. ఎందుకంటే.. చాలా మంది జీతాలో 25- 40 మధ్యలో ఉంటాయి..అందులో 25వేలు చెల్లించాలంటే.. ఎవరూ ఆ సహసం చేయలేరు. బాగా ఎక్కువ జీతం వచ్చే వాళ్లు ఇలాంటివి చేయొచ్చు..ఎందుకంటే..ఈ పథకం మీకు తెలియకుండానే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. నెలకు 2లక్షల జీతం వచ్చే వాళ్లు.. డబ్బు ఎటుపోతుందో అంతా ఖర్చు అయిపోతుంది అని భావించే వాళ్లు ఇలా నెలకు రూ.25వేలు పక్కన పడేస్తే అవే పొదుపు అవుతాయి.