కరోనా బ్యాచ్ కు షాక్..దసరా తరవాత పరీక్షలు..!

తెలంగాణ లో కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను నేరుగా పాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయకుండా సెకండ్ ఇయర్ కు ప్రమోట్ అయ్యిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షల నిర్వహణ పై ఇప్పటికే అధికారులు కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఇటీవల ప్రకటించిన వార్షిక క్యాలెండర్ లో మార్చ్ లో వార్షిక పరీక్షలు ఉండటం తో వీలైనంత త్వరగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పదో తరగతి పాస్ అయిన విద్యార్థులను ఇంటర్ కు ప్రమోట్ చేశారు. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు లేకుండా సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేయడం తో ఎంసెట్, నీట్ పరీక్షలకు వెయిటేజి లేకుండా పోయింది దాంతో అధికారులు, విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నారు.