ఎంసెట్ రిజల్ట్ టెన్షన్.. జేఎన్టీయూ క్యూ కట్టిన విద్యార్థులు

-

ఎంసెట్ రిజల్ట్ టెన్షన్ తో జేఎన్టీయూకు ఇంటర్ విద్యార్థులు, వారి తల్లితండ్రులు క్యూ కడుతున్నారు. కొందరు విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లు తప్పుగా ఎంటర్ చేసినట్టు చెబుతున్నారు. మరి కొందరు ఏమో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ బదులు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్టు గుర్తించారు. అధికారులు క్రాస్ వెరిఫై చేయకుండా ఫలితాలు విడుదల చేశారు. దీంతో విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు.

హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేప్పుడు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సిస్టం యాక్సెప్ట్ చేయలేదని అందుకే ఫస్ట్ ఇయర్ ఎంటర్ చేశామని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఆ నెంబర్లు మార్చుకునేందుకు వారంతా జేఎన్టీయూకు చేరుకున్నారు.ఇక కోవిడ్ భారిన పడి ఎంసెట్ పరీక్ష రాయలేక పోయిన విద్యార్థులకు ఈ రోజు పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు 12.30 కె పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచనలు ఉన్నాయి. ఎల్బీనగర్ లోని ఆయాన్ డిజిటల్ జోన్ లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. ఇక 85 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news