దుబ్బాక ఉప ఎన్నికకు అభ్యర్ధుల ఖరారు.. హీటెక్కిన రాజకీయం

-

దుబ్బాక ఉప ఎన్నికకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్ధులను ఫైనలైజ్ చేసాయి. నిన్న రాత్రి కాంగ్రెస్ అధిష్టానం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఇక నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. రేపు నోటిఫికేషన్ రాగానే ఎన్నికల సందడి మరింత హీటెక్కనుంది. ముందుగా బీజేపీ సీనియర్‌ నేత ఎం.రఘునందన్‌ రావు పేరును ఖరారు చేసింది.

అయితే రఘునందన్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ కిషాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట కమలాకర్ రెడ్డి వ్యతిరేకించారు. దాంతో కమలాకర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది బీజేపీ అధిష్టానం. తరువాత సోలిపేట సుజాత అభ్యర్థిత్వాన్ని టీఆర్ఎస్ ఖరారు చేసింది. నిన్న సీఎం కేసీఆర్‌ను కలిసిన సుజాత బీ ఫామ్ అందుకున్నారు. ఇక నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఖరారు అయ్యింది. ఇక మొత్తానికి మూడు పార్టీలు అభ్యర్ధులను ఫైనలైజ్ అవ్వడంతో, ఇక నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news