కరోనా విషయంలో ఏపీ సీఎం జగన్ ఉద్దేశం ఏంటి? నిన్నటికి నిన్న ఆయన కరోనాను ఉద్దేశించి చాలా లై ట్‌గా ప్రసంగించారని, పెద్దగా వ్యూహం లేకుండానే ఆయన వ్యవహరించారని ప్రతిపక్షం విమర్శలు గు ప్పించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన విషయం తెలి సిం దే. కరోనా అందరికీ వచ్చే అవకాశం ఉందని, తనకు వచ్చినా ఆశ్చర్యంలేదని, చేయాల్సింది చేస్తు న్నా మని, కానీ, కరోనా తగ్గడం లేదని.. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి తలెత్తే అవకా శం ఉంటుందని సీఎంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఓ వర్గం ప్రజల్లోనూ ఆగ్రహం తెప్పించాయి.
ప్రస్తుతం ఏపీలో కరోనా తీవ్రతను గమనించిన ఎవరికైనా కూడా సీఎం చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పిం చాయనడంలో సందేహం లేదు. కరోనా తీవ్రంగా ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. సీఎం ఇలా వ్యాఖ్యానించడం ఏంటి? అని వైద్య వర్గాలు కూడా సందేహం వ్యక్తం చేశాయి. అయితే, సీఎం వ్యాఖ్యల వెనుక ఉన్న మ ర్మం వేరేగా ఉందని ఇప్పుడు వైద్య వర్గాలు చెబుతుండడం , సోషల్ మీడియాలో కూడా సీఎం వ్యాఖ్యల పై సానుకూల వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న మాట నిజమే. ఆ మాటకొస్తే.. ప్రపంచాన్ని, అగ్రరాజ్యాలను కూడా కరోనా కుదిపేస్తోంది.
అయితే, కరోనా విషయంలో కఠిన వ్యాఖ్యలు చేయడం ద్వారా లేదా.. ప్రజలను మరింతగా భయ భ్రాంతు లకు గురి చేయడం ద్వారా సాధించే ప్రయోజనాలు తక్కువనేది మేధావుల మాట. ప్రజలను గైడ్ చేయ డం ద్వారా మాత్రమే వారిలో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. బహుశ ఈ కార ణంగానే కావొచ్చు.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటీవల కాలంలో తన వాయిస్ మార్చారు. ప్రజలను జా గ్రత్తలవైపు నడిపించడమే ధ్యేయమని ఆయన చేసిన ప్రసంగాలను బట్టి తెలుస్తోంది.
ఇప్పుడు జగన్ కూ డా ఇదే వైఖరిని అనుసరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. కరోనా కు ఇప్పటికే ఎలాంటి మందూ లేని నేపథ్యంలో క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ.. నియంత్రించుకోవడమే తప్ప ఎలాంటి ఔషధాలు లేని నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కన్నా కూడా వారికి ధైర్యం చెప్పే ఆలోచనతో మాత్రమే జగన్ వ్యూహాత్మకంగా ప్రసంగించారని అంటున్నారు పరిశీలకులు.