కరోనా ఎఫెక్ట్‌తో ప్రజలు నానా తిప్పలు పడుతున్నాయి. ప్రభుత్వాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా.. కరోనాను కట్టడి చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను కూడా లాక్‌డౌన్‌లో పెట్టి ఇబ్బంది పెడుతున్నా రు. అయితే, ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్‌లో ఆసక్తికర విషయం ఏంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారం. ఆయన ఈ కరోనా ద్వారా తనకు రెండు కీలక అంశాల్లో ఎస్కేప్ అయ్యారనే వాదన పార్టీలోనూ, బయట కూడా వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. కరోనా ఎఫెక్ట్ కారణంగా.. ఎన్నికలు వాయిదా పడ్డాయి. నిజానికి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలు మార్చి నెల చివరిలో జరిగి ఉండాలి.
అయితే, ఈ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అదేసమయంలో స్థానిక ఎన్నికలపై చంద్రబాబు భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక సమరంలో పార్టీ పూర్తిగా డీలా పడింది. దీంతో ఆయన పార్టీని నిలబెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఒకపక్క కీలక నాయకులు అసంతృప్తిలో ఉండడం, మరోపక్క, మరింత మంది నాయకులు పార్టీ మారిపో వడం, అధినేతగా చంద్రబాబుపైనే అనేక సందేహాలు నెలకొనడంతో పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. దీంతో స్థానిక ఎన్నికల్లో సత్తాచాటి తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నారు.
అయితే, అది అంత తేలిక అంశం కాదని గుర్తించిన చంద్రబాబు ఎన్నికలు కొన్నాళ్లపాటు నిర్వహించకుండా ఉంటే మేలని, పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశం వస్తుందని భావించారు. అనూహ్యంగా రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇది బాబుకు ఒకరకంగా మేలు చేసింది. ఇక, కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పుడు మరో లాభం కూడా చంద్రబాబుకు కలిగిందని అంటున్నారు. అది పార్టీ నుంచి జంపింగులు! స్థానికలకు ముందు, ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలోనూ అనేక మంది నాయకులు పార్టీ మారిపోయారు. దీంతో బాబుకు ఏం చేయాలో అర్ధం కాలేదు.
అంతేకాదు, వైసీపీ నాయకులు మా దగ్గర టీడీపీ నుంచి వచ్చేవారి జాబితా ఇంకా పెద్దదే ఉందని లీకులు ఇచ్చారు. ఈ క్రమంలో వారిని ఎలా ఆపాలా? అని తల పట్టుకున్నారు చంద్రబాబు. ఇంతలో కరోనా ఎఫెక్ట్‌తో ఎన్నికలు సహా పనులు కూడా ఆగిపోవడం, ప్రబుత్వం మొత్తంకూడా కరోనా పనుల్లో నిమగ్నం కావడంతో జంపింగులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం మానేయడంతోపాటు నాయకులు కూడా బుద్దిగా ఇళ్లకే పరిమితమయ్యారు. సో.. ఈ కారణంగా కూడా చంద్రబాబు సేవ్ అయ్యారని తమ్ముళ్లే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.