పవన్ మొదటి పాన్ ఇండియా చిత్రం వెనక ఆసక్తికర కథనం..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై మొదట్లో అసలు అంచనాలే లేవు. దానికి కారణం అంతకుముందు క్రిష్ ఇచ్చిన ఫ్లాప్స్. అందువల్ల అసలేమీ అంచనాలు పెట్టుకోలేదు పవన్ అభిమానులు. కానీ, ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసరికి అందరూ షాకయ్యారు. పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ చూడని విధంగా పవర్ ఫుల్ గా జానపద కథలో హీరోలా చూడడంతో, సినిమాలో భారీతనం కనిపించడంతో షాకయ్యారు.

దాంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఐతే హరి హర వీరమల్లు సినిమా వెనక ఆసక్తికర కథనం ఉందట. నిజానికి ఈ కథ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నది కాదట. కంచె సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో మళ్ళీ సినిమా తీయాలని హరి హర వీరమల్లు సినిమాని తెరకెక్కిద్దామని అనుకున్నాడట క్రిష్. కానీ, అప్పటి వరుణ్ణ్ బడ్జెట్ కి సరిపోదు కాబట్టి ఊరుకున్నాడట. ఆ తర్వాత పవర్ స్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఇది సాధ్యమైంది. మొత్తానికి ఫస్ట్ గ్లింప్స్ ఇచ్చిన ఉత్సాహంతో హరి హర వీరమల్లుపై అభిమానులంతా ఆశగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news