ఒకే దేశం – ఒకే రేష‌న్ డేట్ ఫిక్స్‌…

-

జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం ప్ర‌కారం ఇక‌పై కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి. ఈ చ‌ట్టం ప్రకారం అర్హులు అయిన ల‌బ్ధిదారులు దేశంలో ఎక్క‌డ అయినా ఆహార ధాన్యాల‌ను పొందుతారు. ఇది వ‌చ్చే యేడాది జూన్ 1 నుంచి అమ‌ల్లోకి రానుంది. ఈ ప‌థ‌కంపై కొద్ది రోజులుగా తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దేశంలో ఎక్క‌డైనా రేష‌న్ తీసుకునేందుకు కేంద్రం ఓకే చెప్పేసింది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం లోక్‌సభకు ఈ వివ‌రాలు తెలిపారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు తమ రేషన్ కార్డును ఉపయోగించి, తమకు అర్హతగల ఆహార ధాన్యాలను దేశంలోని ఏ రాష్ట్రంలోని ఏ చౌక ధ‌ర‌ల దుకాణం నుంచి అయినా రేష‌న్ స‌రుకులు పొంద‌వ‌చ్చు.

ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళేవారికి ఇబ్బంది లేకుండా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం కోసం ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా లబ్ధిదారు బయోమెట్రిక్/ఆధార్‌ను ధ్రువీకరించిన తర్వాత ఈ పథకం అందుబాటులోకి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news