లవ్ జిహాద్ మరియు బలవంతపు మత మార్పిడిని అరికట్టడానికి తమ ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకువస్తుంది అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేష్ బాగెల్ కీలక ప్రశ్న వేసారు. బిజెపి నాయకుల కుటుంబ సభ్యుల అంతర్-మత వివాహాలు ‘లవ్ జిహాద్’ నిర్వచనంలో వస్తాయా అని నిలదీశారు.
“అనేక మంది బిజెపి నాయకుల కుటుంబ సభ్యులు కూడా అంతర్-మత వివాహాలు చేసుకున్నారు. ఈ వివాహాలు లవ్ జిహాద్ యొక్క నిర్వచనం కింద వస్తాయా అని నేను బిజెపి నాయకులను అడుగుతున్నాను.” అని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి త్వరలో “లవ్ జిహాద్” కు వ్యతిరేకంగా చట్టం ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.