మంటల్లో విమానం బుగ్గి.. 400 మంది ప్రయాణికుల పరిస్థితి ఏంటి?.. వీడియో

-

న్యూ ఇయర్ వేల జపాన్ ను భారీ భూకంపాలు వనికించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజధాని టోక్యోలో జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్‌ 516 విమానం మంగళవారం టోక్యో ఎయిర్‌పోర్టులో భారీ మంటల్లో చిక్కుకు పోయింది.హనేడా విమానాశ్రయం రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ ను ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు చెలరేగి పోవడంతో విమానం పూర్తిగా కాలిపోయింది. వెంటనే అప్రమత్త మైనటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు సహాయక చర్యలను చేపట్టారు . సుమారు 70కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.

ప్రమాద సమయంలో ఆ విమానంలో సిబ్బందితో కలిపి సుమారు 400 పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తు వారందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారు మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.విమానంలో కూర్చుకున్న ప్ర‌యాణికులు కొంద‌రు కిటికీల నుంచి ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు వారి మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version