అయోధ్య రామమందిరం కోసం 2100కిలోల గంట

-

అయోధ్యలో రామందిర నిర్మాణం కోట్లాది హిందువుల స్వప్నం.అందుకే రామాలయం కోసం ఏకంగా 2100కిలోల గంటను తయారు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లా జలేసర్​కు చెందిన​ కళాకారులు. నాలుగు నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. కేవలం ఇత్తడితో కాకుండా అష్టదాతులోని 8 లోహాలతో ప్రత్యేకంగా దీన్ని తీర్చిదిద్దారు. గంట తయారీకి రూపొందించిన అచ్చులో కరిగిన లోహాన్ని నిపేందుకు ఓ క్రేన్​ నే ఉపయోగించారు. మొత్తానికి అనుకున్న పని పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద గంటను సిద్ధం చేశారు.

ఈ గంట తయారీలో మరో విశేషం ఏమిటంటే దీని నమూనా రూపొందించింది ఓ ముస్లిం. ఆయన పేరు ఇక్బాల్ మిస్త్రీ. ఈ వృత్తిలో 30 ఏళ్ల అనుభవం ఉన్న దౌ దయాల్​ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం రోజుకు 8 గంటలపాటు శ్రమించి దీన్ని పూర్తి చేసింది.తాము ఇప్పటివరకు ఇంత భారీ గంటను చూడలేదని వారు చెప్పారు. చారిత్రక రామమందిరం కోసం దీన్ని తయారు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.దేశంలోనే అతిపెద్ద గంటను రామమందిరానికి విరాళంగా ఇస్తామని చెప్పారు జలేసర్​ మున్సిపల్​ కౌన్సిల్ ఛైర్మన్ వికాస్ మిత్తల్​. ఈ గంటను తయారు చేసిన కర్మాగారానికి ఈయనే యజమాని.అయోధ్యలో రామ మందిరం కోసం న్యాయపోరాటం చేసిన నిర్మోహి అఖాడా.. గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు అనంతరం 2100 కిలోల గంటను సిద్ధం చేయమని మిత్తల్​కు ఆర్డర్​ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news