ఇదెక్కడి చోద్యం .. పాకిస్థాన్​లో హింసకు భారత్‌ కారణమట!

-

పాకిస్థాన్​లో ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ అరెస్టు నేపథ్యంలో తీవ్ర అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అల్లర్లపై దాయాది దేశంవింత ఆరోపణలు చేస్తోంది. భారత్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాలు తమ మనుషులను పంపి తమ దేశంలో అల్లర్లు చేయిస్తున్నాయని విచిత్రంగా విమర్శిస్తోంది. ఎవరో స్థానిక నేతో, తీవ్రవాద నేతో ఈ ఆరోపణలు చేశారంటే వారు కక్షతో చేశారని అనుకోవచ్చు. కానీ సాక్షాత్తూ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రత్యేక సహాయకుడు అట్టా తరార్‌ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. ‘మా దేశంలో అల్లర్లు జరగ్గానే భారత్‌లో సంబరాలు చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ స్వీట్లు పంచాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో పాకిస్థాన్‌లో పరిస్థితి నిప్పుల కుంపటిలా తయారైంది. అల్లర్లు, ఆందోళనలతో పాటు పలుచోట్ల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news