ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌..ఇంటర్‌లోనూ గ్రేడింగ్ విధానం?

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌. పదో తరగతి మాదిరిగా ఇంటర్ లోను గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇంటర్ లో మార్కుల విధానం ఉండగా, టెన్త్ లో గ్రేడింగ్ విధానం ఉంది.

ఎంసెట్ లోనూ ఇంటర్ మార్కుల వెయిటేజిని తొలగించడంతో గ్రేడింగ్ విధానంపై చర్చ జరుగుతుంది. దీనిపై కమిటీ వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..అనంతరం మాట్లాడారు. తెలంగాణ టెన్త్‌ ఫలితాలలో 86.60 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఇందులో బాలికలు 88.53 శాతం, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత.. 25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు వచ్చినట్లు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news