అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సంచలనం అయ్యారు. తన ఓటమిని అంగీకరించడానికి ఆయన ఏ మాత్రం కూడా ఒప్పుకోవడం లేదు. రాజకీయంగా తన ఓటమిని ఆయన జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. దీనితో ఇప్పుడు బిడెన్ విషయంలో ఆయన కోర్ట్ ల చుట్టు తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యవహారంపై ఒక జడ్జి సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇది హాస్యాస్పదంగా ఉందని, 70 లక్షల ఓట్లను చెల్లవు అని ప్రకటించాలా అంటూ ప్రశ్నించారు. అమెరికా రాజ్యాంగాన్ని కోర్ట్ లు ఉల్లంఘించాలా అని ప్రశ్నించారు. ఒక్క ఓటు కూడా చెల్లదు అని చెప్పలేమని అది సాధ్యం కాదని స్పష్టం చేసారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది కోర్ట్. అయితే ట్రంప్ మాత్రం… కోర్ట్ లో కేసులు ఉండగానే బిడెన్ తొందర పడుతున్నారని మండిపడ్డారు.