ప్రపంచ దేశాల పై వైరస్ లు దాడి చేస్తున్నాయి. ఇప్పటి కే కరోనా వైరస్ గత రెండు సంవత్సరాలు గా ప్రపంచ దేశాలను ముప్పు తిప్పలు పెడుతుంది. దీనికి తోడు గా అనేక వైరస్ లు పుట్టుకస్తున్నాయి. తాజా గా ఆఫ్రికా లో మరో వైరస్ విజృంభిస్తుంది. ఆఫ్రికా లో ని సౌత్ సూడాన్ అనే దేశం లో ఒక వైరస్ వీర విహారం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ తో సౌత్ సూడాన్ లో దాదాపు 100 పైగా ప్రజలు చనిపోయారని ఆ దేశ మంత్రి కుగ్వాంగ్ ప్రకటించారు.
సౌత్ సూడాన్ లో ని జోంగ్లీ అనే రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో తాగునీటి సమస్య, ఆహార సమస్య తో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు తాగే నీరు మొత్తం కూడా కలుషితం అయింది. దీంతో వైరస్ వ్యాప్తి చెందినట్టు తెలుస్తుంది. కాగ 100 మంది మరణిచింది జోంగ్లి అనే రాష్ట్రం లో ని ఫంగక్ అనే నగరం. ఈ వైరస్ కు గల కారణాల తో పాటు పలు అధ్యయానాలు చేయడానికి డబ్యూ హెచ్ వో బృందం ఇప్పటి కే సౌత్ సూడాన్ కు చేరుకుంది. కాగ ఈ వైరస్ నుంచి వచ్చేది అంటూ వ్యాధా లేదా అనే దాని పై డబ్యూహెచ్ వో బృందం అధ్యయనం చేయనుంది.