దేశంలో కొనసాగుతున్న ఓమిక్రాన్ కల్లోలం… 73కు చేరిన కేసుల సంఖ్య

-

దేశంలో ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. మొల్లిమెల్లిగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ అనతికాలంలోనే ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా వ్యాపించింది. అత్యంత వేగంగా మహమ్మారి వ్యాపిస్తోంది. దేశంలో కొత్తగా మహారాష్ట్రలో 4, కేరళలో 4, తమిళనాడు చెన్నై నగరంలో 1 కేసు నమోదైంది. దీంతో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 73కు చేరింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న తెలంగాణలో కూడా కొత్తగా 02 కేసులు నమోదుకావడం రా ష్ట్ర వాసులను కలవరపెడుతోంది.

ముఖ్యంగా మహారాష్ట్రలో ఓమిక్రాన్ తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలోని ఓమిక్రాన్ కేసులను గమనిస్తే.. మహారాష్ట్రలో 32, రాజస్థాన్ 17, ఢిల్లీలో 06, కేరళ 5, తెలంగాణ 2, వెస్ట్ బెంగాల్ 01, గుజరాత్ 4, కర్ణాటక 03, తమిళనాడు 01, చంఢీగడ్ 01, ఏపీ 01 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యయాయి.

Read more RELATED
Recommended to you

Latest news