అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ అపహరణకు యత్నం జరిగింది. 42 ఏళ్ల వ్యక్తిపై అభియోగాలు మోపారు నాన్సీ. అతడు గత శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని పెలోసి ఇంట్లకి చొరబడి.. ఆమె భర్త పౌల్ పెలోసీ (82)పై సుత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అతడు నాన్సీ ఎక్కడా అని పెద్దగా కేకలు వేశాడు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడి అని నాన్సీ అన్నారు.
ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టైన డేవిడ్ డెపాపె అనే వ్యక్తిపై సోమవారం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అదనంగా రెండు అభియోగాలను నమోదు చేసింది. వీటిల్లో అమెరికా అధికారుల విధులను ఆటంకపర్చేందుకు కుటుంబీకులపై దాడి చేయడం, నాన్సీ పెలోసీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం ఉన్నాయి. అనుమానితుడి వద్ద నుంచి ఒక టేప్ రోల్, తాడు, సుత్తి వంటి వాటిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ నేపథ్యంలోనే అతడు నాన్సీ పెలోసీని బందీగా పట్టుకోవడానికి యత్నించాడనే నిర్ధారణకు వచ్చారు. ఈ దాడి రాజకీయ ప్రేరేపితమని భావిస్తున్నారు. దీంతో ఈ కోణంలో కూడా సమాంతర దర్యాప్తు చేస్తున్నారు.