ఈ అమ్మాయి చేసిన అద్బుతాన్ని చూస్తే నోర్లు వెల్లబెట్టాల్సిందే..

-

కొందరు మాత్రమే కొన్ని పనులకు పర్ఫెక్ట్ అనే పనులు కొన్ని వుంటాయి.. అందులో కళాకండాలు కొన్ని.. వాటిని ఎలా చేస్తారు అనే విషయం జనాలను ఆలోచింపచేస్తుంది.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ న్యూస్ లు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని మాత్రం ఎలా సాధ్యం అనే విధంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. మొన్నటివరకు చేతులతో పెయింటింగ్స్ వెయ్యడం మనం చూసాము.. కానీ ఇప్పుడు మాత్రమే అందుకు భిన్నంగా ఓ యువతి అబ్బురపరచే పెయింటింగ్ ను వేసింది.. దాన్ని చూసిన వారంతా కామెంట్ చెయ్యక మానరు..ఆ పెయింటింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేవుడు మీద భక్తితో ఆమె వేసిన పెయింట్ అద్భుతం, చూడటానికి రెండు కళ్లు చాలవు.. రామ రామా అంటూ రామకోటిని రాస్తుండగా అద్భుతం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రాజస్థాన్‌ జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ శివానీ మందా చేత్తో రామ రామ అని రాస్తూ అద్భుతమైన పెయింటింగ్ గా మలిచింది.

ఇది నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. పెయింట్, బ్రష్ లతో పని లేకుండా.. కేవలం స్కెచ్ పెన్నుల సాయంతో దేవనాగరి లిపిలో రామ్ అని ఒక లక్షా 11 సార్లు రాసి అద్భుతమైన పెయింటింగ్‌గా మార్చింది. రామ నామాలతో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు అద్భుతంగా చిత్రీకరించింది. ఇందుకు ఆమె రంగు రంగుల స్కెచ్ పన్నులను ఉపయోగించింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ అద్భుతమైన పెయింటింగ్ వీడియో ను ఒకసారి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news