Syria Earthquake : సిరియాలో భూకంపం.. శిథిలాల కింద చిన్నారి జననం

-

సిరియాలో భూకంప ధాటికి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన జిండేరిస్‌లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన పసికందును సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి.

భూకంపం వచ్చిన కాసేపటికి ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. బిడ్డకు జన్మనిచ్చి ఆ తల్లి చనిపోయింది. ఆ పాప తండ్రి, నలుగురు తోబుట్టువులు కూడా శిథిలాల కింద చతికిపోయి ప్రాణాలు వదిలారు. సహాయక చర్యల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్న సమయంలో చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నెమ్మదిగా మట్టిని, రాళ్లను తొలగించి ఆ పసికందును సురక్షితంగా బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ‘

చిన్నారికి అయా (Aya) అని నామకరణం చేశారు. అయా అంటే అరబిక్‌లో ‘మిరాకిల్‌’ అని అర్థం. ఇంతటి ఘోరవిపత్తులో ప్రాణాలతో బయటపడినందుకు శిశువుకు ఆ పేరు పెట్టారు. ప్రస్తుతం చిన్నారి ఆలనాపాలనా వైద్యుడు హానీ మారూఫ్‌ భార్యే చూసుకుంటోంది. తమ కూతురితో సమానంగా పాలు పడుతున్నట్లు వైద్యుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version