మరోసారి ట్రూడో అక్కసు.. ‘ఎన్నికల్లో విదేశీ జోక్యం’పై దర్యాప్తులో భారత్ పేరు

-

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరోసారి భారత్పై తన అక్కసు వెళ్లగక్కారు. భారత్‌ విషయంలో ట్రూడో వ్యవహరిస్తోన్న తీరుతో ఇరు దేశాల మధ్య అంతకంతకూ సంబంధాలు దిగజారుతున్నాయి. ఇప్పటికే నిజ్జర్ హత్య విషయంలో దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతుండగా.. తాజాగా కెనడా సర్కార్ మరో నిర్ణయం ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది.

కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో ఆ దేశం భారత్‌ పేరును చేర్చింది. తమ దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందంటూ అప్పట్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రూడో ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు దర్యాప్తులో ఇప్పుడు భారత్‌ పేరును చేర్చింది కెనడా సర్కార్. 2019, 2021 ఎన్నికల్లో న్యూదిల్లీ జోక్యం ఆరోపణలపై సమాచారం ఇవ్వాలంటూ ఆ కమిషన్‌ కెనడా ప్రభుత్వాన్ని కోరింది. చైనా, భారత్‌తో పాటు రష్యా వంటి దేశాలపైనా కెనడా ఈ ఆరోపణలు చేయగా.. వాటిని ఆయా దేశాలు ఖండించాయి.

Read more RELATED
Recommended to you

Latest news