సీఎం అయ్యాక జగన్ మారిపోయాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. జగన్ కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని నా సొంత లాభం గురించి చూసుకోకుండా ఏది అడిగితే అది జగన్ కోసమే చేశానని షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని బీజేపీకి బానిసగా చేశాడని షర్మిల ఫైర్ అయ్యారు. వైయస్ వారసులు అని చెప్పుకుంటే సరిపోదని ప్రజల కోసం కూడా పని చేయాలని విమర్శించారు షర్మిల. రాజధాని పోలవరం ఏమయ్యాయి అని వైయస్ షర్మిల అడిగారు.
తన కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని షర్మిల అన్నారు కాకినాడ జిల్లాల పర్యటనలో భాగంగా పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం అయ్యారు షర్మిల. రాష్ట్రాన్ని తన కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందని బుధవారం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. పోలవరం వైయస్ కలల ప్రాజెక్టు అని అన్నారు రాజశేఖర్ రెడ్డి వెళ్లిపోయిన తర్వాత టిడిపి కానీ వైసీపీ కానీ పట్టించుకోలేదని అన్నారు.