హింసను ప్రోత్సహించడాన్ని ఏమాత్రం ఆమోదించం: కెనడా

-

హింసను ప్రేరేపించే పనులను ఏ మాత్రం ఆమోదించబోమని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. గత వారం వాంకోవర్‌లో కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరాగాంధీ హత్య చిత్రాలను ప్రదర్శించడంపై కెనడా పబ్లిక్‌ సేఫ్టీ మంత్రి డొమనిక్‌ ఎల్‌ లిబ్లెన్స్‌ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వాంకోవర్‌లోని ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారని.. హిందూ కెనడా వాసుల్లో భయాందోళనలు సృష్టించడమే వీరి లక్ష్యం అని ఇండో-కెనడీయన్‌ చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య అన్నారు. కొన్నేళ్ల క్రితం బ్రాంప్టన్‌లో చేసిన కుట్రకు ఇది కొనసాగింపు మాత్రమేనని వ్యాఖ్యానించారు.

“కొన్ని నెలల క్రితం అమెరికాకు చెందిన ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ మాట్లాడతూ కెనడాలోని హిందువులు తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని బెదిరించిన సంగతి తెలిసిందే. వీరు తుపాకుల చిత్రాలను ప్రదర్శిస్తూ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఏమాత్రం చర్యలు తీసుకోకపోతే ఈ వైఖరి దేశానికి ప్రమాదకరంగా మారుతుంది’’ అని చంద్ర ఆర్య హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version