టిబెట్ పౌరుల నుంచి ‘డీఎన్‌ఏ’ సేకరిస్తోన్న చైనా.. ఆందోళనలో అమెరికా

-

గత కొన్నేళ్లుగా చెనా.. టిబెట్ పౌరుల నుంచి బలవంతంగా డీఎన్​ఏ సేకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లక్షల మంది నమూనాలు సేకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. టిబెట్ పౌరులను తమ నియంత్రణలో ఉంచుకోవడానికి.. వారి పర్యవేక్షణ కోసమే డ్రాగన్ దేశం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలుస్తోంది. అయితే చైనా చేస్తున్న ఈ పనిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. టిబెట్‌ స్వతంత్ర ప్రాంతం (TAR)లో ఆరేళ్లుగా సుమారు 9.2లక్షల నుంచి 12లక్షల మంది పౌరుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను చైనా పోలీసులు సేకరించినట్లు సెప్టెంబర్‌ 2022లో సిటిజెన్‌ ల్యాబ్‌ నివేదిక వెల్లడించింది. ఆ ప్రాంతంలోని మూడో వంతు ప్రజల నుంచి సేకరించినట్లు అంచనా.

‘భారీ స్థాయిలో టిబెట్‌ పౌరుల డీఎన్‌ఏలను చైనా సేకరిస్తోందని వార్తలు వస్తున్నాయి. అక్కడి పౌరులపై నియంత్రణ, పర్యవేక్షణ కోసమే చైనా ఈ తరహా చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది’ అని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొన్నారు. మానవ జన్యు సమాచారం సేకరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందvి అన్నారు. మరోవైపు బ్లింకెన్‌ వ్యాఖ్యలను అంతర్జాతీయ టిబెట్‌ ప్రచార సంస్థ (ఐసీటీ) స్వాగతించింది.

Read more RELATED
Recommended to you

Latest news