ఏపీ దివ్యాంగులకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్‌రెడ్డి సర్కార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు, ప్రభుత్వ గ్రాంట్ పొందుతున్న ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో వారికి రిజర్వేషన్ కల్పించింది.
దివ్యాంగ విద్యార్థులకు 5 శాతానికి తగ్గకుండా సీట్లు కేటాయించాలని జీవో ఇచ్చింది. వీటిలో ప్రవేశం కోసం వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు కూడా ఇచ్చింది. 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికే ఇవి వర్తిస్తాయని పేర్కొంది.