ప్ర‌పంచం ముందు దోషిగా నిల‌బ‌డ‌లేకే!

-

క‌రోనా వైర‌స్ ఇది ముమ్మాటికీ చైనా సృష్టే. దీని వెన‌క ఎలాంటి కుట్ర జ‌రిగింది?  దీని వల్ల ప్ర‌పంచ మాన‌వాళి ఎలాంటి స‌వాళ్లు ఎదుర్కోబోతోంది? .. వైర‌స్ ఒక్క‌టేనా.. దీని వెన‌క మ‌రిన్ని భ‌యంక‌ర‌మైన వైర‌స్‌ల‌ని చైనా ప్ర‌పంచంపై వ‌ద‌ల‌బోతోందా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పెద్ద‌న్న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో పాటు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ క‌రోనా వైర‌స్ చైనా సృష్టే న‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

వేల‌ల్లో జ‌నాలు మృత్యు వాత ప‌డుతుంటే వారిని కాపాడ‌లేక కుటుంబాలు ఆహా కారాలు చేస్తున్నాయి. వైర‌స్ పుట్టు పూర్వోత్త‌రాలు. దాని ల‌క్ష్యం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలకు ఖ‌చ్చితంగా తెలిసి కూడా ఆ విష‌యాన్ని ఇప్ప‌టికీ బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. ఇదిలా వుంటే వైర‌స్‌కు పుట్టిల్లుగా నిలిచిన చైనా మాత్రం త‌న త‌ప్పుని క‌ప్పి పుచ్చుకోవ‌డానికి కొత్త ఎత్తులు వేస్తోంది. ప్ర‌పంచం మొత్తం వైర‌స్‌తో యుద్ధం చేస్తుంటే చైనా కుయుక్తులు చేస్తూ యుద్ధానికి దిగుతోంది.

ఇలా యుద్ధానికి దిగ‌డం వ‌ల్ల వైర‌స్ పై ప్ర‌పంచ దృష్టిని మ‌ర‌ల్చొచ్చ‌నేది డ్రాగ‌న్ ఎత్తుగ‌డ‌. దీని కార‌ణంగా ల‌ద్ద‌ఖ్‌, హ‌మాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో కొర్రీలు పెడుతోంది. శాంతి శాంతి అంటూనే యుద్ధానికి కాలు దువ్వుతూ కుటిల నీతిని ప్ర‌ద‌ర్శిస్తోంది. సైన్యాన్ని మోహ‌రిస్తూనే వాస్త‌వాధీన రేఖ వెంట శాంతి కోరుకుంటున్నాం అంటోంది. చైనా తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ త‌మ భూభాగంలో అంత‌ర్భాగ‌మ‌ని ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్ప‌డం మొద‌లుపెట్టింది. వైర‌స్ నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో ప్ర‌పంచం ముందు దోషిగా నిల‌బ‌డ‌లేక నానా తంటాలు ప‌డుతూ ఇండియాతో క‌య్యానికి దిగ‌డం ప్ర‌పంచ దేశాల‌న్నీ నిశితంఆ గ‌మ‌నిస్తున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news