దక్షిణాసియాలోని వివాదాస్పద అంశాల పరిష్కారంలో ఏకపక్ష చర్యలను అంగీకరించమని చైనా, పాకిస్థాన్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. రెండు దేశాలు దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని గమనంలో ఉంచుకుని వ్యవహరిస్తున్నాయని రెండు దేశాలు కలిసి శనివారం ఒక ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రాంతంలోని కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదని స్పష్టం చేశాయి.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాలుగు రోజుల చైనా పర్యటన ముగింపు సందర్భంగా ఈ ప్రకటన విడుదలైంది. జమ్ముకశ్మీర్‌లోని తాజా పరిస్థితులను గురించి చైనా నేతలకు పాకిస్థాన్ వివరించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనుకున్న తమ సూచనను చైనా పునరుద్ఘాటించింది.