ఆ దేశంపై చైనా మ‌రో కుట్ర‌..!

-

డ్రాగ‌న్ కంట్రీ చైనా ప్ర‌పంచ దేశాల‌పై ప‌ట్టుసాధించేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది. స‌రిహ‌ద్దు దేశాల‌తో క‌య్యానికి దిగుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్‌ను శాసించేందుకు వ్యూహాలు ర‌చిస్తోంద‌ని, ఇందులో భాగంగానే క‌రోనా వైర‌స్‌ను ప్ర‌పంచంపైకి వ‌దిలిందంటూ అంత‌ర్జాతీయంగా అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా.. చైనా మ‌రో కుట్ర‌కు తెర‌లేపుతోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. చైనా వ‌క్ర‌ముద్ధిని నిరంత‌రం ప్ర‌పంచానికి చాటిచెప్పే తైవాన్‌పై చైనా భారీ కుట్ర‌కు ప్లాన్ వేస్తోంద‌ని, ఏకంగా ఆదేశాన్ని ఆక్రమించేందుకు మిలటరీ చర్యకు చైనా సిద్ధమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగ్నేయ తీరంలో చైనా భారీగా అత్యాధునిక ఆయుధాలను, సైనిక బలగాలను మోహరిస్తుండటం ఇందులో భాగ‌మేన‌ని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆధునిక ఢీఎఫ్‌ 17 క్షిపణులను చైనా మోహరిస్తోందని అంటున్నారు.

నిజానికి తైవాన్ స్వీయ పాల‌న‌లో ఉంది. కానీ.. తైవాన్‌‌ చైనాలో అంతర్భాగమని చైనా వాదిస్తోంది. ఈ క్ర‌మంలోనే తైవాన్‌ను తన నియంత్రణలోకి తీసుకునేందుకు చైనా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. అందుకే.. అవసరమైతే మిలటరీ చర్యకు వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప‌లుమార్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే కెనడాకు చెందిన *కన్వా డిఫెన్స్‌* రివ్యూ కీల‌క అంశాల‌ను వెల్ల‌డించింది. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో చైనా ఆయుధ వ్యవస్థల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని పేర్కొంది. తైవాన్ ఆక్ర‌మ‌ణే ల‌క్ష్యంగా యుద్ధం చేసేందుకు క్షిపణి వ్యవస్థలను చైనా ఇటీవల రెట్టింపు స్థాయిలో బలోపేతం చేసిందని వెల్లడించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య యుద్ధం త‌ప్ప‌దేమోన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news