మిర్చిలో ప్రభాస్ డైలాగ్ చెబుతున్న కరోనా!!

-

ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గిందా లేక జనాలకు కరోనా అంటే భయం తగ్గిందా అంటే… రెండోదానికే ఎక్కువ ఓట్లు పడతాయి! అవును కరోనా అంటే కొత్తలో ఉన్న భయం ఇప్పుడు జనాలకు లేదు! కానీ.. నిజంగా జాగ్రత్తలు తీసుకునేవారు, భయపడేవారు అలానే ఉన్నారు.. నిర్లక్ష్యం చేసేవారు అదేపనిలో ఉన్నారు. ఆ సంగతులు అలా ఉంచితే ఇంతకాలం అల్లకల్లోలం చేసిన కరోనా ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతుందని వినిపిస్తున్న కథనాల నడుమ “శీతాకాలం అంటే కరోనాకెంతిష్టమో” అనే బ్యాడ్ న్యుస్ ఒకటి హడలెత్తిస్తోంది!

అవును.. శీతాకాలం అంటే కరోనాకు ఎంతో ఇష్టమంట! ఈ విషయాలపై తాజాగా స్పందించారు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్. శీతాకాలంలో కరోనా మరోసారి విజృభించే అవకాశాలు ఉన్నాయని, ఆ అవకాశాలను కొట్టిపారేయలేమని చెబుతున్నారు. ఇందుకు యూరప్ లో జరిగిన సంఘటనను గుర్తుచేస్తున్నారు వీకే పాల్. యూరప్ లో తిరగబెడుతున్న కేసులను గుర్తుచేస్తూ శీతాకాలంలో భారత్ లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని, దీనిపై ప్రస్తుతం మరింత పరిశోధనలు జరుపుతున్నమని పాల్ వెల్లడించారు.

కాబట్టి.. “ఇంతకాలం ఒక లెక్క ఇకపై ఒక లెక్క.. శీతాకాలం వచ్చిందని చెప్పండి.. శీతాకాలం వచ్చిందని చెప్పండి జనాలకు..” అంటూ కరోనా వైరస్ మిర్చిలో ప్రభాస్ డైలాగ్ చెబుతుందన్నమాట! మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది!! లైట్ తీసుకోవద్దు!

Read more RELATED
Recommended to you

Latest news