చైనా గుట్టును బ‌య‌ట‌పెట్టిన స‌మాధి ఫొటో..!

-

ఇండియా‌-చైనా స‌రిహ‌ద్దు గల్వాన్‌ వ్యాలీలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జూన్‌ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఘర్షణలో చైనా సైనికులు కూడా 40 మంది వరకు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. కానీ చైనా మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఈ విష‌యంపై నోరువిప్ప‌లేదు. అయితే.. తాజాగా ఓ సమాధి రాయి ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ ఘ‌ర్ష‌ణ‌లో చైనా సైనికులూ చ‌నిపోయార‌న్న‌దానికి ఈ స‌మాధే సాక్ష్య‌మ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. చైనీస్‌ ఇంటర్నెట్‌ వీబో అకౌంట్‌లో సైనికుడి సమాధి రాయికి సంబంధించిన ఫోటో ప్రత్యక్ష‌మ‌వ‌డంతో ఆ ఫోటో మన దేశంలో వైర‌ల్ అయింది.

అయితే.. ఈ సమాధి చైనా సైనికుడు చెన్‌ జియాంగ్‌రాంగ్‌కు చెందినదిగా భావిస్తున్నారు. సమాధిపై మాండరిన్‌ భాషలో ‘69316 దళాల సైనికుడు, పింగ్నాన్, ఫుజియాన్ నుంచి’ అని రాసి ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా.. *చెన్ జియాంగ్రో సమాధి. జూన్ 2020లో భారత సరిహద్దు దళాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన వీర‌మ‌ర‌ణం పొందారు. మరణానంతరం కేంద్ర సైనిక కమిషన్ జ్ఞాపకం చేసుకుంది* అని కూడా ఉంది. 2020 ఆగస్టు 5న దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ రీజియన్‌లో ఈ సమాధిని నిర్మించినట్లు ఫోటో చూపిస్తోంది. మరణించిన సైనికుడు 19 సంవత్సరాల వయస్సు వాడని.. అతడు 2001 డిసెంబర్‌లో జన్మించినట్లు సమాధి మీద రాసి ఉంది. అయితే దీనిపై ఇంకా చైనా అధికార యంత్రాంగం స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news