కొవిడ్ సోకిన చిన్న పిల్లల్లో టైప్-1 షుగర్!

-

కొవిడ్‌-19 బారినపడ్డ చిన్నారుల్లో టైప్‌-1 మధుమేహానికి సంబంధించిన లక్షణాలు వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. కరోనా ఉద్ధృతంగా సాగిన కాలంలో చిన్నారుల్లో ఈ వ్యాధి నిర్ధరణ రేటు చాలా ఎక్కువగా ఉందని జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డయాబెటీస్‌ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. .

టైప్‌-1 మధుమేహం వచ్చిన వారిలో వ్యాధికారక సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించాల్సిన రోగనిరోధక వ్యవస్థ అదపు తప్పి, ఆరోగ్యంగా ఉన్న స్వీయ కణాలు, అవయవాలపైనే దాడి చేస్తుంది. ఇటువంటి వారిలో అసాధారణ స్థాయిలో దాహం, ఆకలి, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, తీవ్ర అలసట, దృష్టి మందగించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. వీరికి చికిత్స కోసం ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇస్తుంటారు.

కొవిడ్‌-19 బారినపడ్డ చిన్నారుల్లో ఈ ఐలెట్‌ ఆటోయాంటీబాడీల స్థాయి అధికంగా ఉన్నట్లు ఇంతకు ముందు చేసిన పరిశోధనల్లో తేలగా.. తాజాగా జర్మన్ శాస్త్రవేత్తలు ఐలెట్‌ ఆటోయాంటీబాడీలు ఇప్పటికే కలిగిన (టైప్‌-1 మధుమేహం ఆరంభ దశలో ఉన్న) చిన్నారులు కరోనా బారినపడితే, వారిలో టైప్‌-1 మధుమేహ (షుగర్) వ్యాధి లక్షణాలు చాలా వేగంగా బయటపడే వీలుందని కనుగొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version