మూడో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తున్నాం: ట్రంప్‌

-

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతున్నాయని ఆయన అన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు అమెరికా ఏం చేస్తోందని ప్రశ్నించిన ట్రంప్.. తాజా ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. బైడెన్‌ కాలిఫోర్నియా బీచ్‌లో సేద తీరుతున్నారని.. కమలా హారిస్‌ ఎన్నికల ప్రచారం పేరిట దేశవ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్‌ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె నేతృత్వంలో అసలు దేశానికి భవిష్యత్తే ఉండదు. ప్రపంచాన్ని ఆమె అణు యుద్ధం దిశగా తీసుకెళ్తారు. ఆమెను ప్రపంచం ఎప్పటికీ గౌరవించబోదు. అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్‌పై యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా ఇజ్రాయెల్పై వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. మరో యుద్ధం ముంచుకొస్తుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news