వరుస విజయాలతో.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ కు లైన్ క్లియర్!..

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు దాదాపుగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు లైన్ క్లియర్ అయింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో వరుస విజయాలతో ఆయన దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అయోవాలో గెలిచిన ట్రంప్ తాజాగా న్యూ హ్యాంప్షైర్ ప్రైమరీలో 52.5 శాతం ఓట్లతో విజయం సాధించారు. ట్రంప్ తర్వాత స్థానంలో ఉన్న నిక్కీ హేలీకి 46.6 శాతం ఓట్లు వచ్చాయి. అధ్యక్ష పదవికి నామినేషన్‌ కోసం పోటీపడిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో ప్రస్తుతం పోటీ ట్రంప్‌, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యే జరుగుతోంది.

Donald-Trump

తాజా విజయాలతో రిపబ్లికన్ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ట్రంప్నకు దాదాపు లైన్ క్లియ‌ర్ అయినట్టు సమాచారం. మరోవైపు అధ్యక్ష పదవిలో లేకుండా వరుసగా అయోవా, న్యూ హ్యాంప్షైర్లలో గెలుపొందిన తొలి రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ రికార్డు క్రియేట్ చేశారు. న్యూ హాంప్షైర్ ప్రైమరీ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచిన ఏకైక రిపబ్లికన్ అభ్యర్థి కూడా ఆయనే.

Read more RELATED
Recommended to you

Latest news