ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. హమాస్‌ను సమూలంగా అంతం చేసేందుకు కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ ఆ దిశగా గాజాపై విరుచుకు పడుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ యుద్ధంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. హమాస్ సభ్యులను ఇజ్రాయెల్ పూర్తిగా హతమార్చడం లేదా ఖైదు చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
లెక్స్ ఫ్రిడ్మన్ అనే అమెరికన్ పాడ్‌కాస్ట్ షోలో మాట్లాడుతూ ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఆగాలంటే.. హమాస్ సభ్యులను చంపడమే లేదా జైళ్లలో పెట్టడమో చేయాలని.. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మస్క్ తెలిపారు. అలా చేయకపోతే ఆ ఉగ్రవాదులు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారని (ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తూనే ఉంటారన్న ఉద్దేశం) అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంపై తలెత్తున్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమని ఎలాన్ మస్క్ అన్నారు. హమాస్.. సైనికపరంగా ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందని ఊహించలేకపోయిందని వ్యాఖ్యానించారు.
"I think it's appropriate for Israel to find the Hamas members and either kill them or incarcerate them, that's something that has to be done because they are going to keep coming otherwise."
– @elonmusk pic.twitter.com/NnpqQJKro8
— The Mossad: Satirical, Yet Awesome (@TheMossadIL) November 9, 2023