ఉద్యోగాలు హాబీ కోసమే చేసే రోజులు వస్తాయి : ఎలాన్ మస్క్‌

-

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్లో ఉద్యోగం చేయడం కేవలం ఆప్షన్ మాత్రమే అవుతుందని అన్నారు. ఏఐ.. నెమ్మదిగా మనుషుల ఉద్యోగాలన్నిటినీ ఊడగొడుతుందని వ్యాఖ్యానించారు. పారిస్‌లో జరిగిన ఓ సాంకేతిక కార్యక్రమంలో మస్క్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని మాట్లాడారు. బహుశా మనలో ఎవరికీ భవిష్యత్‌లో ఉద్యోగాలు ఉండవని పేర్కొన్నారు.

ఉద్యోగం అవసరం కోసం కాకుండా కేవలం అభిరుచి కోసమే చేసే రోజులు వస్తాయి. కొన్నేళ్లలోనే కృత్రిమ మేధ సామర్థ్యాలు అతివేగంగా అభివృద్ధి చెందాయి. రెగ్యులేటర్‌లు, కంపెనీలు, యూజర్లు ఆ సాంకేతికతను ఎలా బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలో ఇంకా తెలుసుకునే దశలోనే ఉన్నారు. ఇయాన్ బ్యాంక్స్ రాసిన కల్చర్ బుక్ సిరీస్‌లో మాదిరిగా భవిష్యత్‌ సాంకేతికత.. వాస్తవికమైంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతే నా అతిపెద్ద భయం. ఉద్యోగాలు లేని ప్రజలు మానసికంగా సంతృప్తి చెందుతారా? కంప్యూటర్లు మన కంటే మెరుగ్గా పని చేస్తే మన జీవితానికి అర్థం ఉంటుందా? అని ఎలాన్ మస్క్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news