అమ్మానాన్న తర్వాత అంతే ప్రేమను అందించేది ఒక్క తోడబుట్టిన వారే. అన్న, తమ్ముడు లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. మనతో పాటు పుట్టి, మనతో పాటు పెరిగి మనకు తెలియకుండానే మన సోదరులకు మనకు మధ్య ఒక విడదీయరాని బంధం ఏర్పడుతుంది. వీళ్ల మనకు మొదటి స్నేహితులు. అన్న చెల్లి, అక్కతమ్ముల బంధం చాలా బాగుంటుంది. అవును ప్రతి అక్క నాకు ఒక అన్న ఉంటే బాగుండు అని ఫీల్ అవుతుంది. ప్రతి తమ్ముడు నాకు ఒక చెల్లి కానీ అక్క కానీ ఉంటే బాగుండు అని ఫీల్ అవుతారు. వాళ్ల మనకంటే ముందు పుట్టిన వాళ్లు మాత్రమే కాదు.. మన మార్గదర్శకులు కూడా..! ఆ ఫీలింగ్ అన్న లేని అక్కకు మాత్రమే తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మే 24న నేషనల్ బ్రదర్స్ డే జరుపుకుంటారు. మరీ ఈరోజును పురస్కరించుకోని సోదరులు ప్రాముఖ్యత, సోదరుల దినోత్సవం చరిత్ర గురించి తెలుసుకుందామా..!
మన సోదరులతో మనం పంచుకునే ప్రత్యేక బంధాన్ని గౌరవించేందుకు జాతీయ సోదరుల దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటారు. సోదరులు నిజంగా ఒక ఆశీర్వాదం. జాతీయ సోదరుల దినోత్సవం ప్రతి సంవత్సరం మే 24న జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది శుక్రవారం వచ్చింది. ఇది 2005లో ప్రారంభమైన సంప్రదాయం
జాతీయ సోదరుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత
ఈ రోజు ఒక ముఖ్యమైన సందర్భం, ఎందుకంటే మీ సోదరులు మీ క్రైమ్ పార్టనర్స్, మీ స్ట్రస్ బస్టర్స్, మీ సపోర్టర్స్, మీ స్ట్రెంత్, మీ వీక్‌నెస్. వాట్‌నాట్ చెప్పండి. ఇది కుటుంబ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. సంక్షోభం మరియు ఒంటరితనం సమయంలో సోదరులు అందించే ఓదార్పు మరియు ఉపశమనాన్ని మనకు గుర్తుచేస్తుంది. జాతీయ సోదరుల దినోత్సవం ఈ సంబంధాలను గౌరవించమని ప్రోత్సహిస్తుంది. సమయం మరియు దూరాన్ని మించిన శాశ్వతమైన స్నేహాన్ని జరుపుకుంటుంది.
ఈరోజు మీ సోదురులకు మీకు ఉన్న మధ్య ఉన్న ప్రేమను మళ్లీ ఓసారి నెమరవేసుకోండి. దూరంగా ఉంటే వారిని వీలైతే కలవండి. లేదా ఫోన్ చేసి మాట్లాడండి. మీకు మీ సోదరులకు మధ్య ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఫిక్స్ చేసుకోండి. ఈ ప్రపంచంలో మీ అమ్మనాన్న తర్వాత మీ సోదరులో మీ రక్తసంబంధీకులు. పెళ్లి, పెళ్లాం, భర్త, పిల్లలు ఇవన్నీ మధ్యలో వచ్చినవే. అంటే వీళ్లు తక్కువ అని కాదు. వీళ్ల కంటే కూడా మీ బాల్యం నుంచి మీతో ఉన్న మీ తోడబుట్టిన వాళ్లు ఎక్కువ. నిస్వార్థమైన ప్రేమ వాళ్లది. కానీ ఈరోజుల్లో అన్నదమ్ములు మధ్య అనుబంధం కంటే ఆస్తి తగాదాలు ఎక్కువ అవుతున్నాయి.