అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్ రామస్వామిపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసల వర్షం కురిపించారు. వివేక్.. నమ్మకమైన అభ్యర్థి అంటూ కొనియాడారు. ఓ మీడియా సంస్థకు వివేక్ ఇచ్చిన ఇంటర్వ్యూను షేర్ చేస్తూ.. ఈ మాట అన్నారు మస్క్. వివేక్.. భారత సంతతి వ్యక్తి. రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వివేక్ తనపై విమర్శలు చేసినప్పటికీ.. ఆయనను మస్క్ పొగడటం గమనార్హం.
అయితే ఇటీవల మస్క్ చైనాలో పర్యటించారు. ఈ పర్యటనను వివేక్ తీవ్రంగా వ్యతిరేకించారు. బీజింగ్ అజెండాకు అనుకూలంగా అమెరికా వ్యాపారవేత్త ప్రచారం చేస్తున్నారని.. అమెరికాకు కావాల్సింది.. చైనా జేబుల్లో ఉండే నేతలు కాదని, బైడెన్‌తోనూ ఇదే తరహా సమస్య అని వివేక్ విమర్శలు గుప్పించారు. ఇక వివేక్ రామస్వామి గురించి వస్తే.. ఆయన అమెరికాలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
He is a very promising candidate https://t.co/bEQU8L21nd
— Elon Musk (@elonmusk) August 17, 2023