ఈ రోజుల్లో ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు పీకేస్తారో తెలియని పరిస్థితి. పైగా ఇచ్చే శాలరీకీ చేసే పనికి అసలు పొంతనే ఉండదు. ఇచ్చేది తక్కువ చేయించుకునే పని ఎక్కువగా ఉంటుంది. అయినా మన వర్క్ మీద బాస్‌కు సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలంటారు. అస్సలు ఒక్కో స్టేజ్‌లో.. ఛీ..ఇదేం జీవితంరా బాబు.. దీనిబదులు ఊర్లోకి వెళ్లి వ్యవసాయం చేసుకున్నా సరిపోతుంది అనుకునే ఉంటారు కదా..! చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం మొదలుపెడితే.. ఆ సంతృప్తి వేరు. మన కిందనే నలుగురు వర్కర్స్ ఉంటారు. మీ రాజ్యానికి మీరే బాస్.. ఇవన్నీ చెప్పుకోవడానికి బానే ఉంటాయి.. అంతంత పెట్టుబడి ఎక్కడ నుంచి తేవాలి అయినా మనం ఏం బిజినెస్ స్టాట్ చేస్తాం అనుకుంటున్నారా..?
బంగాళా దుంప చిప్స్ వ్యాపారం. చిరుతిండ్లకు మంచి డిమాండ్ ఉన్న ఈ తరుణంలో ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా మేలు. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కేవలం రూ.850కే లభించే మెషిన్ కొనుగోలు చేయడం ద్వారా మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాలు ప్రారంభమయ్యే కొద్దీ వ్యాపారాన్ని విస్తరించి లాభాలను మరింత ఎక్కువ చేసుకోవచ్చు. ముడి పదార్థాలపై కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. తొలిదశలో రూ.100 నుంచి 200 వరకు ధరలోనే ముడిసరుకును కొనుగోలు చేయొచ్చు.
మీరు ఈ యంత్రాన్ని ఆన్‌లైన్‌లో సులభంగా కనుగొనవచ్చు. మీరు వాటిని ఏదైనా టేబుల్‌పై ఉంచడం ద్వారా చిప్‌లను సులభంగా కత్తిరించవచ్చు. ఇంకా ఈ మిషన్ ఎక్కువ స్థలాన్ని కూడా తీసుకోదు. ఇంకా ఈ మిషన్‌కు కరెంట్ కూడా ఎక్కువ అవసరం కాదు. అసలు ఈ మిషన్ పని చేయడానికి కరెంట్ అస్సలు అవసరమే ఉండదు. ప్రస్తుతం ఫ్రెష్ ఫ్రైడ్ హాట్ చిప్స్ తినే ట్రెండ్ మొదలైంది. మీరు చిప్‌లను కూడా మంచి క్వాలిటీ, రుచితో తయారు చేస్తే మీ విశ్వసనీయత పెరిగి డిమాండ్ అధికం అవుతుంది.
ఈ చిప్స్ వ్యాపారాన్ని ఇంటి ముందు చిన్న బండి లేదా స్టాల్‌లో అమ్మడం ప్రారంభించవచ్చు. కొంతమంది దుకాణదారులతో మాట్లాడటం ద్వారా వారితో ఒప్పందం చేసుకోవచ్చు. తద్వారా మీ వ్యాపారం ఎక్కువ మందికి చేరుతుంది. బంగాళాదుంప చిప్స్ ఆదాయం ఖర్చు కంటే 7 రెట్లు ఎక్కువ ఉంటుంది.
రోజుకు 10 కిలోల బంగాళాదుంప చిప్స్ అమ్మితే సింపుల్‌గా రూ.1000 సంపాధించవచ్చు. మీరు మార్కెటింగ్ కోసం ఫ్రీగా సోషల్ మీడియాను కూడా వాడుకోవచ్చు.