తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ద్వీపదేశం శ్రీలంక. తాజాగా శ్రీలంకలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్సె అత్యవసర పరిస్థితి విధించాడు. అయితే.. తాజాగా ఎమర్జెన్సీని ఎత్తివేశారు శ్రీలంక అధ్యక్షులు గోటబయ రాజపక్ష. ఈ మేరకు మంగళ వారం రోజున అర్ధరాత్రి ప్రకటన చేశారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో.. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 వ తేదీ నుంచి శ్రీలంక లో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే… ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటన చేశారు. దీంతో శ్రీలంక దేశ ప్రజలకు భారీ ఊరట లభించింది. శ్రీలంక దేశంలో అత్యవసర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఆహార ధాన్యాలు, వస్తువులు, నిత్యవసరాలు అన్ని విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యలో శ్రీలంక అధ్యక్షులు గోటబయ రాజపక్ష ఇంటిని కూడా ప్రజలు ముట్టడించారు.
Sri Lanka | Visuals from Colombo after Emergency was revoked in the country. pic.twitter.com/yxuMMFuqhG
— ANI (@ANI) April 6, 2022