‘మాజీ అధ్యక్షులకూ మినహాయింపు’.. సుప్రీంకోర్టులో ‘ట్రంప్’కు ఊరట

-

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం రోజున చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా, ముగ్గురు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు తాజా నిర్ణయంతో నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలలోపు న్యాయస్థానాల్లో ట్రంప్‌ను విచారించే అవకాశాలు ఉండవు.

అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారని ట్రంప్పై అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ట్రంప్నకు తాజాగా భారీ ఊరట లభించింది. అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజనను అనుసరించి ప్రస్తుత అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ పేర్కొన్నారు. అధ్యక్షుని అధికారిక చర్యలు అన్నిటికీ విచారణ నుంచి రక్షణ ఉంటుందని, అనధికారిక చర్యలకు మాత్రం మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news